
హైదరాబాద్: రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. వాస్తవానికి ఈ నెలలోనే ఆయన రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. రంజాన్ కారణంగా షెడ్యూల్లో మార్పు చేసుకున్నారు. మే 6,7 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. మే 6న వరంగర్ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న రైతు సంఘర్షణ సభలో రాహుల్ పాల్గొననున్నారు. సాయంత్రం 6గంటలకు ఆయన సభకు హాజరవుతారు. రైతు రుణమాఫీ, విత్తనాలు, వడ్ల కొనుగోలుతో పాటు అన్నదాతలకు సంబంధించిన ఇతర సమస్యల గురించి సభలో మాట్లాడనున్నారు. మే 7న హైదరాబాద్ రానున్న రాహుల్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ పరిస్థితి, భవిష్యత్తు కార్యచరణపై నేతలకు రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు.