పోలీసుల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త ఆత్మహత్య

పోలీసుల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త ఆత్మహత్య

ఖమ్మం: పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారనే కారణంతో బీజేపీ మజ్దూర్ ఖమ్మం అధ్యక్షుడు సాయి గణేశ్ పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పట్టణంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయి గణేశ్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. మంత్రి పువ్వాడ అజయ్, స్థానిక టీఆర్ఎస్ నేతలు, సీఐ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని సాయి గణేశ్ ఆరోపించాడు. అతడిని వెంటనే స్థానిక హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ సాయి గణేశ్ ఈ రోజు మృతి చెందాడు. సాయి గణేశ్ మృతి పట్ల బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అతడి మృతికి టీఆర్ఎస్ నాయకులే కారణమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆరోపించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

యాత్ర పేరుతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు

ఉగ్రవాదంపై కలసి పోరాడుదామన్న ఆర్మీ