ఉగ్రవాదంపై కలసి పోరాడుదామన్న ఆర్మీ

ఉగ్రవాదంపై కలసి పోరాడుదామన్న ఆర్మీ

శ్రీనగర్: కశ్మీర్ లో ఉగ్రవాదంపై పోరులో అందరూ కలసి పోరాడాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. టెర్రరిజం మీద జరిపే యుధ్ధంలో కశ్మీర్ ఒంటరి కాదని.. తాము అండగా ఉంటామని తెలిపింది. లోయలో వరుస ఉగ్ర ఘటనల నేపథ్యంలో ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. టెర్రరిజం వల్ల సమాజంలోని ప్రతి వర్గంలోని పౌరులు ఎలా నష్టపోయారనేది వివరిస్తూ ఈ వీడియో సాగింది. 

కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామని ఆర్మీ ఆ వీడియోలో తెలిపింది. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకూ కట్టుబడి ఉన్నామని చెప్పింది. 'టెర్రరిజం వల్ల దశాబ్దాలుగా లోయలో ఎందరో అమాయకులు తమకు కావాల్సిన వారిని కోల్పోయారు. ఎందరో స్త్రీలు విధవలయ్యారు. అనేక మంది తమ సొంతవారిని కోల్పోయి అనాథలయ్యారు. బిడ్డల్ని కోల్పోయి వృద్ధాప్యంలో బాధలు పడుతున్న తల్లిదండ్రులూ అనేకం ఉన్నారు. ఉగ్రవాదులు మన యువతను తప్పుదోవ పట్టించారు. తద్వారా కొన్ని కమ్యూనిటీల మధ్య అగాథం అంతకంతకూ పెరిగింది. వాళ్లు మన సమాజాన్ని విభజించాలని ప్రయత్నించారు ' అని ఆర్మీ పేర్కొంది. ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్మీ నివాళులు అర్పించింది.

 మరిన్ని వార్తల కోసం

 

హనుమాన్ శోభాయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు

వివేక్ అగ్నిహోత్రి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఫిలిం మేకర్