మేడిగడ్డ బ్యారేజ్ స్వయంగా పరిశీలించి.. ఫొటోలు, వీడియో తీసిన రాహుల్ గాంధీ

మేడిగడ్డ బ్యారేజ్ స్వయంగా పరిశీలించి.. ఫొటోలు, వీడియో తీసిన రాహుల్ గాంధీ

మేడిగడ్డ బ్యారేజ్ ను స్వయంగా పరిశీలించటమే కాదు.. బ్యారేజ్ మొత్తం తిరిగి పరిశీలించారు రాహుల్ గాంధీ. తన ఫోన్ లో.. తానే స్వయంగా ఫొటోలు, వీడియో తీయటం విశేషం. బ్యారేజ్ కు అయిన డ్యామేజ్ ఏంటీ.. ఎందుకు ఇలా జరిగింది.. లోపం ఎక్కడ.. పిల్లర్లు కుండిపోవటం వల్లే బ్యారేజ్ ప్రమాదంలో పడింది.. దీని వల్ల రైతులు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు.. మరమ్మతులు చేయటానికి ఉన్న అవకాశాలు ఏంటీ.. ఎన్ని రోజులు పడుతుంది.. ఇలాంటి ఎన్నో విషయాలను.. బ్యారేజ్ ఇంజినీరింగ్ అధికారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు రాహుల్ గాంధీ.

అక్టోబర్ 21న కుంగిపోయిన  మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం హెలికాప్టర్ లో వెళ్లి  సందర్శించారు. కుంగిన బ్యారేజ్ పిల్లర్లను పరిశీలించారు. రాహుల్ వెంట రేవంత్ రెడ్డి, భట్టి, శ్రీధర్ బాబు ఉన్నారు.  అనంతరం మేడిగడ్డ హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్ కు తిరుగు పయనం అయ్యారు

 కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో  భాగంగా చేపట్టిన మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించానని ట్వీట్ చేసిన  రాహుల్ గాంధీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్   కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ..  ఆయన కుటుంబం తమ వ్యక్తిగత ఏటీఎంగా వాడుకుంటున్నారన్నారని ధ్వజమెత్తారు.    నాసిరకం నిర్మాణం కారణంగా పలు స్తంభాలకు పగుళ్లు ఏర్పడ్డాయని..  స్తంభాలు మునిగిపోతున్నట్లు రిపోర్ట్స్ ఉన్నాయని తెలిపారు.