కర్ణాటకలో బీజేపీ మత విధ్వేషాలు రెచ్చగొడుతోంది

కర్ణాటకలో బీజేపీ మత విధ్వేషాలు రెచ్చగొడుతోంది

కర్ణాటకలోని చిత్రదుర్గ్ లో శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సందర్శించారు. లింగాయత్ వర్గానికి చెందిన మఠంలో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. రాహుల్ గాంధీ భవిష్యత్ లో ప్రధాని అవుతారని ఈ మఠం పెద్ద శ్రీ శివమూర్తి మురుగ శరణన్నా తెలిపారు. రాహుల్ గాంధీ శివమూర్తి నుంచి లింగదీక్ష తీసుకున్నారు. కొంత కాలంగా బసవన్న గురించి చదువుతున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. మఠానికి రావడం గర్వంగా భావిస్తున్నానన్నారు. ఇష్టలింగ, శివయోగ గురించి వివరంగా నేర్పేవాళ్లు కావాలని రాహుల్ గాంధీ అన్నారు.

బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అందమైన రాష్ట్రాన్ని బీజేపీ నాశనం చేస్తోందన్నారు రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా స్టేట్ ను రన్ చేసిన విధానాన్ని రాహుల్ కొనియాడారు. ఇప్పుడు బీజేపీ పూర్తి డిఫెరెంట్ గా పాలిస్తుందన్నారు.