ఏ సెగ్మెంట్ వదులుకోవాలో..తేల్చుకోలేకపోతున్న

ఏ సెగ్మెంట్ వదులుకోవాలో..తేల్చుకోలేకపోతున్న
  •    మలప్పురం సభలో రాహుల్​ గాంధీ కామెంట్ 
  •     రెండూ ముఖ్యమే.. కానీ, ఒక్కదానికే ఎంపీగా ఉండగలను
  •     రెండు సార్లు గెలిపించిన వయనాడ్​కు రుణపడి ఉంటా
  •     రాయ్​బరేలీ ఓటర్లూ ఆదరించారు

మలప్పురం (కేరళ) : వయనాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలీలో ఏ లోక్​సభ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తెలియడం లేదని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ అన్నారు. ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు చెప్పారు. వయనాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బరేలీల్లో ఏదో ఒక నియోజకవర్గానికే తాను ఎంపీగా ఉండాలని తెలిపారు. తన నిర్ణయంతో రెండు సెగ్మెంట్ల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఈ మేరకు రెండోసారి గెలిపించిన వయనాడ్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మలప్పురంలో బుధవారం నిర్వహించిన పబ్లిక్ మీటింగ్​లో రాహుల్ మాట్లాడారు. ‘‘త్వరలో వయనాడ్ ప్రజలను కలుస్తాను. ఎవరికి ఎంపీగా ఉండాలో తేల్చుకోలేకపోతున్నాను. వరుసగా రెండు సార్లు వయనాడ్ ఓటర్లు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. అందరికీ నేను రుణపడి ఉంటాను. అటు రాయ్​బరేలీ ఓటర్లు కూడా నన్ను ఆదరించారు’’ అని రాహుల్ అన్నారు.

నాకు ప్రజలే దేవుళ్లు

లోక్​సభ ఎలక్షన్ క్యాంపెయిన్ టైమ్​లో ‘‘ప్రజా సేవ చేసేందుకు దేవుడే నన్ను పంపించాడు” అని మోదీ చేసిన కామెంట్లపై రాహుల్ వ్యంగంగా స్పందించారు. ‘అతని వెంట ఓ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏం చెప్తే అతను అదే చేస్తాడు. ఈ మాట ఆయనే స్వయంగా చెప్పారు. అదానీ, అంబానీలకు అనుకూలంగా అన్ని నిర్ణయాలు తీసుకోవాలని దేవుడు ఆదేశిస్తే.. అదే ఆయన చేస్తాడు’ అంటూ పరోక్షంగా మోదీని విమర్శించారు. తాను ఒక సాధారణ మనిషిని అని, తనకు ప్రజలే దేవుళ్లు అని అన్నారు.దేశ ప్రజలు, వయనాడ్ ఓటర్లే తనకు దేవుళ్లని, వాళ్లు ఏంచెప్తే తాను అదే చేస్తానన్నారు.

బీజేపీకి బుద్ధి చెప్పారు

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారని రాహుల్ విమర్శించారు. యూపీలో బీజేపీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటూ మోదీ ప్రచారం చేశారని, ఇది నచ్చకపోవడంతోనే ఘోరంగా ఓడించారని తెలిపారు. అయోధ్య ప్రజల చేతిలో బీజేపీ ఓడినట్లే వారణాసిలో మోదీ ఓడిపోయి ఉండేవారని తెలిపారు. కొద్దిలో తప్పించుకున్నారని అన్నారు.

లోక్​సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల దెబ్బకు ఎన్డీయే కూటమి చతికిలపడిందని రాహుల్​ విమర్శించారు. బీజేపీ, మోదీకి దేశ ప్రజలు స్పష్టమైన సందేశం  పంపించారన్నారు. ఇప్పటికైనా మోదీ తన నియంతృత్వ వైఖరి మార్చుకోవాలని సూచించారు.