అస్సామీ కల్చర్‏ను రాహుల్ అవమానించాడు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

అస్సామీ కల్చర్‏ను రాహుల్ అవమానించాడు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహూకరించిన గమోసాను ధరించకుండా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అస్సామీ వస్త్ర సంప్రదాయాలను అగౌరవపరిచారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. రాహుల్ గాంధీ తనకు నచ్చింది చేసుకోవచ్చని.. కానీ, బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఈశాన్య రాష్ట్ర సంస్కృతిని అగౌరవపరచడాన్ని సహించదని ఆయన అన్నారు. 

శుక్రవారం అస్సాంలోని దిబ్రూగఢ్‌‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విదేశీ ప్రముఖులతో సహా విందుకు హాజరైన వారందరూ గౌరవ సూచకంగా గమోసాను ధరించారు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం దానిని ధరించలేదని అమిత్​షా విమర్శించారు. అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఈశాన్య సంస్కృతిని, ఈశాన్య ప్రజలను గౌరవించడం నేర్చుకోవాలని, లేకపోతే అతను ఓట్లు అడగకూడదు" అని ప్రకటించారు.