కేటీఆర్ సర్ నాకు న్యాయం చేయండి : రాహుల్ సిప్లిగంజ్ ట్వీట్

కేటీఆర్ సర్ నాకు న్యాయం చేయండి : రాహుల్ సిప్లిగంజ్ ట్వీట్

పబ్ గొడవలో న్యాయం చేయండంటూ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో రిక్వెస్ట్ చేశారు సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. గచ్చిబౌలి ప్రిజమ్ పబ్ లో మొన్న రాత్రి జరిగిన గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను.. రాహుల్ సిప్లిగంజ్ ట్విట్టర్ లో కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. ఈ గ్యాంగ్ ను నన్ను ఎలా రెచ్చగొట్టిందో.. నాపై ఎలా దాడి చేసిందో చూడండి.. న్యాయం చేయండి అంటూ కేటీఆర్ ను కోరారు రాహుల్.  తెలంగాణపై పుట్టాను కాబట్టి.. తాను టీఆర్ఎస్ కే ఓటేశాననీ చెప్పిన రాహుల్.. తెలంగాణకోసమే తాను పని చేస్తానని అన్నారు.