రోహిత్‌ ఔట్‌.. రాహుల్‌కు వన్డే కెప్టెన్సీ

రోహిత్‌ ఔట్‌.. రాహుల్‌కు వన్డే కెప్టెన్సీ

ముంబై: వన్డే కెప్టెన్‌‌గా అపాయింట్‌‌ అయిన తర్వాత జరిగే తొలి సిరీస్‌‌కే రోహిత్‌‌ శర్మ దూరమయ్యాడు.  తొడ కండరాల గాయం కారణంగా రోహిత్‌‌ సౌతాఫ్రికాతో ఈ నెల19 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌‌లో ఆడటం లేదు. అతని ప్లేస్‌‌లో లోకేశ్‌‌ రాహుల్‌‌ కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. టీమిండియాను తను ఫస్ట్‌‌ టైమ్‌‌ లీడ్‌‌ చేయనున్నాడు. రాహుల్‌‌కు కెప్టెన్సీ.. సీనియర్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాకు వైస్‌‌ కెప్టెన్సీ అప్పగించిన సీనియర్‌‌ సెలక్షన్‌‌ కమిటీ..18 మందితో కూడిన జంబో టీమ్‌‌ను శుక్రవారం ప్రకటించింది. వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత విరాట్‌‌ కోహ్లీ ఫస్ట్ టైమ్‌‌ ప్యూర్‌‌ బ్యాటర్‌‌గా ఈ సిరీస్‌‌లో ఆడనున్నాడు. ఇక, మూడున్నరేళ్ల తర్వాత సీనియర్‌‌ స్పిన్నర్‌‌ అశ్విన్‌‌ వన్డేల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఫామ్ కోల్పోయినప్పటికీ ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ను కూడా సిరీస్‌‌కు ఎంపిక చేసిన కమిటీ ఆల్‌‌రౌండర్‌‌ వెంకటేశ్‌‌ అయ్యర్, టాపార్డర్‌‌ బ్యాటర్‌‌ రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌కు కూడా చాన్స్‌‌ ఇచ్చింది. జడేజా, అక్షర్‌‌ పటేల్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధించకపోవడంతో వాషింగ్టన్‌‌ సుందర్‌‌, యుజ్వేంద్ర చహల్‌‌ మళ్లీ టీమ్‌‌లోకి వచ్చారు. షమీకి రెస్ట్‌‌ ఇచ్చిన సెలెక్టర్లు బుమ్రాకు తోడు భువనేశ్వర్‌‌, దీపక్‌‌ చహర్‌‌, ప్రసిద్‌‌, సిరాజ్‌‌ను తీసుకున్నారు. 

కోహ్లీని దిగిపోవద్దన్నాం: చేతన్​
టీ20 కెప్టెన్‌‌గా దిగిపోవద్దని బీసీసీఐలోని అందరూ విరాట్‌‌ కోహ్లీని రిక్వెస్ట్‌‌ చేశారని చీఫ్‌‌ సెలక్టర్‌‌ చేతన్‌‌ శర్మ అన్నాడు. ‘టీ20 వరల్డ్‌‌ కప్‌‌ ముగిసేంత వరకూ వెయిట్‌‌ చేయాలని సెలక్టర్లు, బీసీసీఐ ఆఫీస్‌‌ బేరర్లతో సెలక్షన్‌‌ మీటింగ్‌‌ అటెండ్‌‌ అయిన అందరం కోహ్లీకి చెప్పాం. తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని అంతా సూచించారు’ అని స్పష్టం చేశాడు.  

టీమ్‌‌: కేఎల్‌‌ రాహుల్‌‌ (కెప్టెన్‌‌), ధవన్‌‌, గైక్వాడ్‌‌, కోహ్లీ, సూర్యకుమార్‌‌, శ్రేయస్‌‌, వెంకటేశ్‌‌, పంత్‌‌ (కీపర్​), ఇషాన్‌‌ (కీపర్‌‌), చహల్‌‌, అశ్విన్‌‌, సుందర్‌‌, బుమ్రా (వైస్‌‌ కెప్టెన్‌‌), భువనేశ్వర్‌‌, దీపక్‌‌ చహర్‌‌, ప్రసిధ్‌‌ కృష్ణ, శార్దూల్‌‌, సిరాజ్‌‌.