ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు.. రైల్వే ప్రాజెక్టులతో భారీ వృద్ధి..అమీన్జీ రబ్బర్ ఎండీ దీసావాలా

ఎదుగుదలకు ఎన్నో అవకాశాలు.. రైల్వే ప్రాజెక్టులతో భారీ వృద్ధి..అమీన్జీ రబ్బర్ ఎండీ దీసావాలా

హైదరాబాద్​, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న భారీ ప్రాజెక్టుల వల్ల తమ ఉత్పత్తులకు, సేవలకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇంజనీర్డ్ రబ్బర్ సొల్యూషన్స్ సంస్థ అమీన్​జీ రబ్బర్ లిమిటెడ్ ఎండీ ముఫద్దల్ దీసావాలా చెప్పారు. ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల్లో తమ ఉత్పత్తులను విరివిగా వాడుతున్నారని తెలిపారు. ఇటీవల బీఎస్​ఈ ఎస్ఎమ్ఈ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై   లిస్ట్ అయిన ఈ సంస్థ, దేశీయ రైల్వే రబ్బర్ ప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు 50 శాతం సరఫరా చేయగల ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉంది. ప్రభుత్వం రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ కేటాయింపులు, క్యాపెక్స్ భారీగా పెంచడం కంపెనీకి సానుకూలమని 'వెలుగు' ఇంటర్వ్యూలో దీసావాలా వివరించారు. ఆయన మాటల్లో..

 రైల్వే రంగంలో భారీ పెట్టుబడులు

భారతీయ రైల్వే గత 150 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వేగంగా ఆధునీకరణ చెందుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 2.72 లక్షల కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం మూడు పెద్ద రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి 900 కిలోమీటర్ల దూరాన్నికవర్ చేస్తాయి.  దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే కారిడార్లు అవుతాయి.  కాండ్లా, ముంద్రా పోర్టులకు కనెక్టివిటీ పెరుగుతుంది.    రైల్వే ఉత్పత్తుల సరఫరా వ్యాపారంలో మార్జిన్లు చాలా బలంగా ఉన్నాయి. ఈ ప్రత్యేక విభాగంలో కంపెనీ 20 నుంచి 25 శాతం ఎబిటా మార్జిన్లను సాధిస్తోంది.

 ఆత్మనిర్భర్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊతం

విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి  మేం అంతర్జాతీయ ప్రమాణాలతో బ్రిడ్జ్​ బేరింగ్స్ తయారు చేస్తున్నాం.  రబ్బర్ సొల్యూషన్స్ రంగంలో కంపెనీకి రెండు దశాబ్దాల అనుభవం ఉంది. కాంపోజిట్ గ్రూవ్డ్ రబ్బర్ సోల్ ప్లేట్లు, యూఐసీ రబ్బర్ వెస్టిబూల్స్, రబ్బరైజ్డ్ లెవెల్ క్రాసింగ్స్, ఎలాస్టోమెరిక్ బేరింగ్స్ వంటివి సరఫరా చేస్తున్నాం. కంపెనీకి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబ్​గుర్తింపు పొందిన ల్యాబ్ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ అండ్ హైవేస్, రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) అనుమతులు ఉన్నాయి. కొత్త టెక్నాలజీ కోసం మరిన్ని పెట్టుబడులు పెడుతున్నాం.

డిఫెన్స్ వీల్స్, మెట్రో రంగాల్లోకి ఎంట్రీ

“రైల్వే రంగానికి పెరుగుతున్న క్యాపెక్స్ అవసరాలకు అనుగుణంగా ప్లాంట్లలో మెషినరీ ఆధునీకరణ, ఉత్పాదక సామర్థ్యాన్ని నిరంతరం పెంచుతున్నాం. రక్షణ రంగంలోకి (డిఫెన్స్ వీల్ బిజినెస్) కొత్తగా అడుగుపెడుతున్నాం. మిలిటరీ ట్యాంకులు, సాయుధ ఆర్మీ వాహనాలకు ఉపయోగించే రబ్బర్ లైన్డ్ వీల్స్ (రబ్బర్ పూత పూసిన చక్రాలు), ట్రాక్ ప్యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సరఫరాకు ట్రయల్స్ జరుగుతున్నాయి. 

దేశంలో వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్టుల ఆర్డర్లను దక్కించుకోవడంపై కూడా దృష్టి పెట్టాం.  ఎగుమతులను పెంచుకోవడానికి కంపెనీ కొత్త ప్లాన్లు రెడీ చేశాం.  మెట్రో రైల్ ప్రాజెక్టులకు కూడా రబ్బర్ కాంపోనెంట్లను సరఫరా చేసే ఆర్డర్లపై కంపెనీ ఫోకస్​ చేసింది. కంపెనీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 123.25 కోట్ల ఆదాయంపై రూ.6.34 కోట్ల లాభం వచ్చింది” అని దీసావాలా వివరించారు.