మియాపూర్: మహిళపై దాడి చేసిన హోంగార్డు సర్వీస్ నుంచి తొలగింపు..నిందితుడి అరెస్ట్ 

మియాపూర్: మహిళపై దాడి చేసిన హోంగార్డు సర్వీస్ నుంచి తొలగింపు..నిందితుడి అరెస్ట్ 

మియాపూర్, వెలుగు: హఫీజ్​పేట్​రైల్వేస్టేషన్​సమీపంలో ఓ మహిళపై దాడి చేసి, జుట్టు పట్టుకొని ఈడ్చుకువెళ్లిన రైల్వే హోంగార్డుపై పోలీస్​ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. హోంగార్డును సర్వీస్​నుంచి తొలగించారు. మియాపూర్​ పోలీసులు అతన్ని అరెస్ట్​ చేశారు. వికారాబాద్​జిల్లా పరిగి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన కె.ఆనంద్ ప్రస్తుతం డిప్యూటేషన్​పై హఫీజ్​పేట్ రైల్వేస్టేషన్​లో హోంగార్డుగా చేస్తున్నాడు.

శుక్రవారం రాత్రి స్టేషన్​సమీపంలో ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి, ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లాడు. స్థానికులు ఈ సంఘటనను వీడియో తీసి సోషల్​మీడియాలో పోస్టు చేయడంతో వైరల్​అయింది. దీనిపై డీజీపీ సీవీ ఆనంద్​స్పందించారు. ఆనంద్​ను సర్వీస్​ నుంచి తొలగించి, క్రిమినల్​కేసు నమోదు చేయాలన్న ఆదేశాల మేరకు సైబరాబాద్​ పోలీస్ కమిషనర్ రమేశ్​చర్యలు తీసుకున్నారు.