Vande Bharat sleeper trains: గుడ్ న్యూస్..వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయోచ్..

Vande Bharat sleeper trains: గుడ్ న్యూస్..వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయోచ్..

దేశంలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు సక్సెస్ అయిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రైల్వే శాక 41 వందేభాతర్ ఎక్స్ ప్రస్ రైళ్తను, రెండు అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించి విజయవంతంగా రన్ చేస్తోంది. తాజాగా వందే భారత్ స్లీపర్ రైళ్లు ఆరునెలల్లో పట్టాలపై పరుగుతు పెడతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ( మార్చి 9) చెప్పారు. వచ్చే నాలుగైదు నెల్లలో 10 వందే భారత్ స్లీపర్ రైళ్లు ట్రయల్ రన్ ప్రారంభమవుతుందని.. ఆ తర్వాత రైల్వే  ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పారు. 

బెంగలూరులోని బీఈఎంఎల్ సంస్థ వందేభారత్ స్లీపర్ కోచ్ ల తయారీ చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ మరో 100 అృత్ భారత్ (నాన్ ఎసీ స్లీపర్) రైళ్లకు ఆర్డరు ఇచ్చింది. వందేభారత్ రైళ్లు, వందే స్లీపర్, వందే భారత్ మెట్రో అనే మూడు ఫార్మాట్లలో వందేభారత్ ను ప్రవేశపెడతామని మంత్రి చెప్పారు. మెట్రో కోచ్కు రూ. 9 నుంచి 10 కోట్లు, వందే భారత్ కోచ్ కు రూ. 8 నుంచి రూ. 9 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే మంత్రి చెప్పారు. 

ఈ వందేభారత్ స్లీపర్ రైళ్లలో పదకొండు 3టైర్, నాలుగు 2టైర్, ఒక 1వ తరగతి కోచ్ సహా 16 కోచ్ లు ఉంటాయి.ఈ ట్రైన్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. స్లీపర్ రైలులో మొత్తం 67 బెర్త్ లు ఉంటాయి. ఏసీ కంట్రోల్, కుషన్ ఫర్నిషింగ్, మొబైల్ ఛార్జింగ్, స్టోరేజ్ స్పేస్ వంటి సౌకర్యాలను ఆధునిక పద్దతిలో రూపొందించారు. 

ALSO READ :- ఇస్రో లక్ష్యం చంద్రయాన్ 4 చంద్రుని పైనుంచి శాంపిల్స్ తేవాలి

ప్రయాణం సురక్షితంగా సాగించేందుకు కప్లర్లు, యాంటీ క్లైంబర్లు, కవాచ్, ఇతర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.