
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్బీ) సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 14వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 368. (సెక్షన్ కంట్రోలర్) సికింద్రాబాద్ ఆర్ఆర్బీ పరిధి( ఈసీఓఆర్ జోన్ అన్ రిజర్వ్డ్ 02, ఎస్సీ 02, ఎస్టీ 02, ఓబీసీ 01, ఎక్స్ సర్వీస్మెన్01, ఎస్సీఆర్ జోన్ అన్ రిజర్వ్డ్10, ఎస్సీ 03, ఎస్టీ 01, ఓబీసీ 03, ఈడబ్ల్యూఎస్ 01, ఎక్స్ సర్వీస్మెన్ 02.)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 33 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 15.
లాస్ట్ డేట్: అక్టోబర్ 14.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు250. ఇతరులకు రూ. 500.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.rrbchennai.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) : కంప్యూటర్ బేస్డ్ టెస్టులో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. అనలైటికల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీ 60 ప్రశ్నలు 60 మార్కులకు, లాజికల్ కేపబిలిటీ 20 ప్రశ్నలకు 20 మార్కులకు, మెంటల్ రీజనింగ్20 ప్రశ్నలు 20 మార్కులకు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కుల కోత విధిస్తారు. కనీస అర్హత సాధించాలంటే అన్ రిజర్వ్డ్ 40 శాతం, ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఓబీసీ 30 శాతం, ఎస్సీ 30 శాతం, ఎస్టీ 25 శాతం సాధించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు అదనంగా 2 మార్కులు సడలింపు ఉంటుంది.
సిలబస్: అనలైటికల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీ
మ్యాథమెటిక్స్: నంబర్ సిస్టమ్, రేషియో అండ్ ప్రొపర్షన్స్, సరాసరి, శాతాలు, లాభనష్టాలు, పత్రాలు, కాలం, వేగం, దూరం, పవర్ అండ్ వర్క్, ఆల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రొగ్రేషన్, ఎల్ సీఎం, హెచ్సీఎఫ్, జామెంట్రీ, ఏరియా అండ్ వాల్యూమ్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ (బేసిక్ లెవల్). డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటెషన్: చాట్స్, గ్రాఫ్స్, స్కాటర్ ప్లాట్, పై, చార్ట్, స్టాటిస్టికల్ కర్వ్ డిస్ట్రిబ్యూషన్, వెన్ డాయగ్రామ్స్, డేటా సఫిషియెన్సీ, డేటా అరేంజ్మెంట్స్.
లాజికల్ కేపబిలిటీ
లాజికల్ రీజనింగ్: బయనరీ లాజిక్, సిలజిమ్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, అసంప్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ, సాల్వింగ్ లాజిక్– బేస్డ్ ఫజిల్స్.
రీడింగ్ కాంప్రహెన్షన్: సపోర్టింగ్ ఐడియా, అప్లికేషన్, లాజికల్ స్ట్రక్చర్ అండ్ స్టైల్ ఆఫ్ ది గివెన్ ప్యారాగ్రాఫ్.
మెంటల్ ఎబిలిటీ: అనాలజీ, సాల్వింగ్ కోడింగ్ – డి–కోడింగ్ టైప్ క్వశ్చన్స్, సాల్వింగ్ ర్యాంకింగ్ అండ్ అరెంజ్ మెంట్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్.