
కొచ్చి:వందేభారత్ రైళ్లు, రైల్వేస్టేషన్లలో నాసిరకం, కుళ్లిన ఆహారం సరఫరా చేస్తున్నారని మీడియాలో వార్తలు రావడంతో స్పందించిన రైల్వే, ఐఆర్టీసీ సీరియస్గా తీసుకుంది. కేరళలోని ఎర్నాకుళం రైల్వేస్టేషన్ లో ప్రైవేట్ రైల్వే క్యాటరింగ్ క్యాంటీన్ పై దాడులు నిర్వహించింది. ఫుడ్ క్వాలిటీ, క్యాంటీన్ పరిశుభ్రత సరిగా లేవని గుర్తించారు. క్యాంటీన్ ఓనర్ కు 1లక్ష రూపాయల జరిమానా విధించారు.
రళలోని ఎర్నాకుళం రైల్వేస్టేషన్ లో కుళ్లిపోయిన, రెండు మూడు రోజుల క్రితం భోజనం సరఫరా చేశారని ఫిర్యాదులు అందడంతో కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్లు తనఖీలు చేపట్టారు. బేస్ కిచెన్ నిర్వహిస్తున్న బృందావన్ ఫుడ్ ప్రొడక్ట్స్ కు 1లక్ష రూపాయల జరిమానా విధించారు. క్యాటరింగ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని IRCTC ని ఆదేశించారు.
ఈ సంఘటనపై సమగ్ర విచారణకు తిరువనంతపురం డివిజనల్ కమర్షియల్ మేనేజర్, హెల్త్ ఆఫీసర్, ఏరియా మేనేజర్(IRCTC)లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
FSSAI లైసెన్స్ ఉన్నప్పటికీ కొచ్చి కార్పొరేషన్ అధికారులు వాణిజ్య లైసెన్స్ లేదని , నిబంధనల ప్రకారం మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) సరిగ్గా లేదని లోపాలను ఎత్తిచూపారు.
మరోవైపు మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు పరిశుభ్రమైన ఆహారం నిరంతరాయంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని IRCTC హామీ ఇచ్చింది. ఆహారం నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను నిర్వహించేందుకు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేషన్ తెలిపింది.