కవచ్ తో రైలు ప్రమాదాలకు చెక్

కవచ్ తో రైలు ప్రమాదాలకు  చెక్

రైల్వే ప్రయాణం ఇక మరింత భద్రం కానుంది. రైలు ప్రమాదాల నివారణకు ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్టాత్మంగా చేపట్టిన కవచ్‌ ప్రోగ్రామ్‌ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే కూడా చేరింది. రైలు ప్రమాదాల నివారణకు స్వదేశంగా రూపొందించిన ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్  సిస్టమ్ కవాచ్ పనితీరును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో కీలకమైన సికింద్రాబాద్‌ - వాడి - ముంబై మార్గంలో కవచ్‌ను అమల్లోకి తేనుంది. అందులో భాగంగా లింగంపల్లి - వికారాబాద్‌ సెక‌్షన్‌ను కవచ్‌ పరిధిలోకి తెచ్చారు. దీంతో ఈ సెక‌్షన్‌లో ఇకపై రైలు ప్రమాదాలు దాదాపుగా నివారించినట్టేనని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.‌ ఇవాళ ఈ సెక‌్షన్‌లో కవచ్‌ టెస్ట్‌ రైడ్‌ను స్వయంగా పరిశీలించారు. 

మరిన్ని వార్తల కోసం

 

వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ 

మేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ