వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ 

వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ 

తిరుమలలో రెండేళ్ల తర్వాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం మొదలైన తర్వాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. రద్దీ పెరిగినా అన్నప్రసాదాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామని చెప్పారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామన్నారు. ఉత్తర భారత్ నుంచి వచ్చే భక్తుల కోసం భోజనంతో పాటు చపాతీ, రొట్టెలను మూడు పూటలూ అందిస్తామన్నారు. తిరుమలలో మరో రెండు చోట్ల అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్జిత సేవలను మళ్లీ ప్రారంభించేందుకు సమయం పడుతుందన్నారు. సేవల ధరలను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టీటీడీ పాలకమండలి ముఖ్య ఉద్దేశమన్నారు. వీఐపీ దర్శనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. సామాన్య భక్తులకు సర్వదర్సనం ప్రారంభించి పది రోజులు అవుతోందన్నారు.

మరిన్ని వార్తల కోసం:

మేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ

ఉక్రెయిన్‌లో భారత విద్యార్థికి బుల్లెట్ గాయాలు

నాతో చర్చలకు రా.. పుతిన్​కు జెలెన్​స్కీ పిలుపు