నాతో చర్చలకు రా.. పుతిన్​కు జెలెన్​స్కీ పిలుపు

నాతో చర్చలకు రా.. పుతిన్​కు జెలెన్​స్కీ పిలుపు
  • రష్యా డబ్బుతోనే మళ్లీ నిర్మిస్తం
  • ప్రతి ఇంటిని, ప్రతి వీధిని, ప్రతి నగరాన్ని పునరుద్ధరిస్తం: జెలెన్‌‌‌‌స్కీ

కీవ్/మాస్కో: రష్యా డబ్బుతోనే తమ దేశాన్ని మళ్లీ నిర్మిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌స్కీ చెప్పారు. ‘‘మనల్ని నాశనం చేయాలని వాళ్లు అనుకుంటున్నారు. కానీ ఫెయిలయ్యారు. ఉక్రేనియన్లు భయపడతారని, లొంగిపోతారని ఎవరైనా అనుకుంటే.. వారికి ఉక్రెయిన్ గురించి ఏమీ తెలియదని అర్థం. మేం ప్రతి ఇంటిని, ప్రతి వీధిని, ప్రతి నగరాన్ని పునరుద్ధరిస్తాం. రష్యా.. నష్టపరిహారం అంటే ఏంటో తెలుసుకో. మా దేశానికి వ్యతిరేకంగా, ప్రతి ఉక్రేనియన్‌‌‌‌కు వ్యతిరేకంగా మీరు చేసిన ప్రతిదానికీ మాకు తిరిగి మూల్యం చెల్లించుకుంటారు’’ అని స్పష్టంచేశారు. గురువారం తెల్లవారుజామున దేశప్రజలను ఉద్దేశించి జెలెన్‌‌‌‌స్కీ మాట్లాడారు. ‘‘ఈ యుద్ధం రష్యన్ సోల్జర్ల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది. వాళ్లు మాల్స్‌‌‌‌లోకి వెళ్లి.. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నారు. వాళ్లు కేవలం ‘గందరగోళంలో ఉన్న పిల్లలు’. వారిని రష్యా వాడుకుంటున్నది’’ అని జెలెన్‌‌‌‌స్కీ చెప్పారు. దాదాపు 9 వేల మంది రష్యన్ సోల్జర్లను హతమార్చినట్లు వెల్లడించారు. తమ దళాలు వీరోచితంగా పోరాడుతూ దేశాన్ని రక్షిస్తున్నాయని జెలెన్​స్కీ ప్రశంసించారు.

నాతో చర్చలకు రా.. పుతిన్​కు జెలెన్​స్కీ పిలుపు
యుద్ధం ఆగాలంటే తాను, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ డైరెక్ట్ గా చర్చలు జరపడం ఒక్కటే మార్గమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అన్నారు. ‘‘మేం రష్యాపై దాడి చేయడం లేదు. చేయాలని కూడా అనుకోవడం లేదు. మా నుంచి మీకు ఏం కావాలి? మా దేశం వదలి వెళ్లిపోండి” అని ఆయన పుతిన్ ను కోరారు. ‘‘ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రన్ తో మీటింగ్ జరిగిన మాదిరిగా.. 30 మీటర్ల పొడవాటి టేబుల్ కు ఇటూ, అటూ కాదు.. నాతో కలిసి కూర్చోండి” అని పిలుపునిచ్చారు. మరోవైపు, ఉక్రెయిన్‌‌‌‌లో ఎందుకున్నారో కూడా రష్యన్లకు తెలియదని జెలెన్‌‌‌‌స్కీ అన్నారు. ‘‘మా సైనికులు, డిఫెన్స్ బలగాలు, చివరికి మా రైతులు కూడా రష్యన్ సోల్జర్లను ప్రతిరోజు పట్టుకుంటున్నారు” అని  తెలిపారు.