
తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి.
ఆరెంజ్ అలర్ట్స్:
ఈ రోజు(సెప్టెంబర్ 12) ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసిందివాతావరణ శాఖ
ఎల్లో అలర్ట్స్:
ఈ రోజు (సెప్టెంబర్ 12) నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. సెప్టెంబర్ 13న నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ
.