పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం ... వాతావరణ శాఖ హెచ్చరిక

పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం ... వాతావరణ శాఖ హెచ్చరిక

రాష్ట్రంలో పలు జిల్లాలో  వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.  గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.  

రానున్న 2-3 గంటల్లో హైదరాబాద్, జగిత్యాల, జోగులంబా గద్వాల్, కరీంనగర్, మహబూబ్ నగర్, మేడ్చల్-మల్కజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుందని చెప్పుకొచ్చింది. 

అయితే, తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.