ఈ ఏడాది (2026) వానలు తక్కువే..కానీ పడితే కుంభవృష్టే... మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి

ఈ ఏడాది  (2026) వానలు తక్కువే..కానీ పడితే కుంభవృష్టే... మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి
  •      అధికారులంతా జాగ్రత్తగా ఉండాలి
  •     ఐటీ కారిడార్ ​వరద ముప్పు తప్పిస్తం
  •     హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్ ఏవీ రంగ‌‌నాథ్

హైద్రాబాద్ సిటీ, వెలుగు: ఐటీ కారిడార్‌‌కు వ‌‌ర‌‌ద ముప్పుును తప్పించేందుకు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు హైడ్రా క‌‌మిష‌‌న‌‌ర్ ఏవీ రంగ‌‌నాథ్ చెప్పారు. మాన్సూన్ ఏర్పాట్ల పై సీఎంసీ ప‌‌రిధిలోని పలు శాఖల అధికారుల‌‌తో రంగ‌‌నాథ్ , సీఎంసీ క‌‌మిస‌‌న‌‌ర్ సృజ‌‌న హైడ్రా ఆఫీసులో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎంసీ ప‌‌రిధిలో 202 వాటర్ లాగింగ్ పాయింట్లుండగా, 83 మేజ‌‌ర్‌‌, 95 మీడియం, 24 మైన‌‌ర్ పాయింట్లు గుర్తించామన్నారు. 15 రోజుల్లో అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి సమన్వయంతో ప‌‌ని చేయాలన్నారు. వ‌‌ర‌‌ద కాలువ‌‌ల్లో పూడిక‌‌తీతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

 గాలి, వాన‌‌కు ప‌‌డిపోయే ప్రమాదమున్న చెట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని, మ్యాన్‌‌హోల్స్ మూత‌‌లు ఎక్కడ ఉన్నాయ‌‌నేది స్పష్టంగా తెలిసేలా మ్యాపింగ్ చేయాల‌‌రన్నారు. ఎస్ఎంఎస్ అల‌‌ర్ట్స్ ద్వారా భారీ వ‌‌ర్షాల స‌‌మాచారాన్ని ఇవ్వాలన్నారు. 

సీఎంసీ ప‌‌రిధిలో పెద్ద మొత్తంలో వ‌‌ర‌‌ద చేరే దుర్గం చెరువు, ఖాజాగూడ చెరువు, మ‌‌ల్కం చెరువులతో పాటు మరో 28 చెరువులున్నాయ‌‌ని, వీటికి స్లూయ‌‌జ్ గేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్‌‌యూబీల వ‌‌ద్ద ఏర్పాటు చేసిన పంపులు ప‌‌ని చేస్తున్నాయా? వంతెన‌‌ల‌‌పైన ప‌‌డిన వ‌‌ర్షం నీరు రంధ్రాల ద్వారా కింద‌‌కు వెళ్తుందా? లేదా? చెక్ చేసుకోవాల‌‌ని సూచించారు. 8వ తేదీ నాటికి వ‌‌ర్షాలు పడతాయని, ఈ ఏడాది త‌‌క్కువ వ‌‌ర్షాలున్నా,  ప‌‌డిన‌‌ప్పుడు కుంభ‌‌వృష్టి ఉంటుందని హెచ్చరించారు. 

సీఎంసీ క‌‌మిష‌‌న‌‌ర్ సృజ‌‌న మాట్లాడుతూ దాదాపు 98 శాతం డీసిల్టింగ్ ప‌‌నులు పూర్తయ్యాయని, 161 వ‌‌ర‌‌కూ శిథిల భ‌‌వ‌‌నాలున్నాయ‌‌ని, త్వరలోనే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. వ‌‌ర్షాకాలం త‌‌లెత్తే ట్రాఫిక్ సమస్యలను ట్రాఫిక్ డీసీపీ శేషాద్రి రెడ్డి , అడిష‌‌న‌‌ల్ డీసీపీ హ‌‌నుమంత‌‌రావు వివ‌‌రించారు. హైడ్రా అడిషనల్​క‌‌మిష‌‌న‌‌ర్ వ‌‌ర్ల పాప‌‌య్య, ఆర్ సుదర్శన్​, డీఎప్‌‌వో గౌత‌‌మ్‌‌ పాల్గొన్నారు.