హైదరాబాద్ లో భారీ వర్షం..రహదారులు జలమయం

హైదరాబాద్ లో భారీ వర్షం..రహదారులు జలమయం

ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో రెండు గంటల నుంచి భారీ వర్షం పడుతోంది. కోఠి, మలక్ పేట్, చాదర్ ఘాట్, అసెంబ్లీతో పాటు చాలా ఏరియాల్లో వర్షం పడుతోంది. దీంతో గంట నుంచి కురుస్తున్న వర్షానికి... నీరు రోడ్లపైకి చేరింది. ముసారాం బాగ్ బ్రిడ్జ్ పై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో కోఠి నుంచి మలక్ పేట్ వెళ్లే వాహనా దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రంగంలోకి దిగిన GHMC సిబ్బంది... వాటర్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు వర్షపు నీరు రోడ్లపైకి రావటంతో... ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. 

శివారాం పల్లిలో ఇప్పటి వరకు అత్యధికంగా 6 సెంటీ మీటర్ల వర్షా పాతం నమోదు అయ్యింది. రాజేంద్ర నగర్ లో 3.5, మలక్ పేట్, చార్మినార్, శాస్త్రీపురంలో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే నాలుగు రోజులు కీలకమన్నారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరో 24 గంటల్లో అల్పపీడన ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెర్టర్ నాగరత్న తెలిపారు.