కాస్త ఉపశమనం.. దేశ రాజధానిలో తేలికపాటి జల్లులు

కాస్త ఉపశమనం.. దేశ రాజధానిలో తేలికపాటి జల్లులు

ఢిల్లీ NCR లోని అనేక ప్రాంతాలలో నవంబర్ 9న రాత్రి తేలికపాటి వర్షపాతం నమోదైంది. దీంతో దేశ రాజధానిలో పెరిగిన వాయు కాలుష్యం నుంచి చాలా వరకు ఉపశమనం పొందింది. కర్తవ్య మార్గ్, ఢిల్లీ-నోయిడా సరిహద్దు నుంచి వచ్చిన విజువల్స్ లో తేలికపాటి నుంచి మోస్తరు-తీవ్రతతో కూడిన వర్షపు జల్లులను చూపించాయి. నగరంలో కాలుష్య పరిస్థితిని తగ్గించడానికి 'కృత్రిమ వర్షం' ఆలోచనను అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాల మధ్య దేశ రాజధానిలో వర్షపాతం వచ్చింది.

 మరోవైపు కాలుష్య నిరోధక చర్యలను అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రులను కూడా రంగంలోకి దించింది. తనిఖీ ప్రక్రియలో భాగంగా, పలువురు ఢిల్లీ మంత్రులు గురువారం ఢిల్లీని పొరుగు రాష్ట్రాలకు అనుసంధానించే వివిధ ప్రాంతాలు, సరిహద్దులను పరిశీలించారు. ప్రస్తుతం, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) IV దశ జాతీయ రాజధానిలో అమలు చేశారు. ఇక నగరంలో గాలి నాణ్యత 'తీవ్రమైన ప్లస్' కేటగిరీకి పడిపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.