KKR vs GT: ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపుకు వస్తుండటంతో ప్రతీ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారుతోంది. కాసేపట్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగబోయే మ్యాచ్‌కు వాతావరణం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్‌కు తమ మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలవడం అత్యంత కీలకం కాగా.. ఇలాంటి టైమ్‌లో వర్షం పడి మ్యాచ్ రద్దయితే కోల్‌కతా ఆశలు గల్లంతవుతాయి.
కోల్‌కతా ప్రస్తుత వాతావరణం:
ప్రస్తుతానికి కోల్‌కతాలో వర్ష సూచనలు పెద్దగా లేవు. మ్యాచ్ ప్రారంభ సమయానికి నగరం అంతటా అక్కడక్కడా చెదురుమొదురుగా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షం కంటే కూడా ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న విపరీతమైన వేడి, ఉక్కపోత ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టేలా ఉంది. ఇలాంటి క్లైమేట్‌లో ప్లేయర్స్ తమ ఎనర్జీని కాపాడుకోవడం సవాలుతో కూడుకున్నది. ఇక మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడేందుకు దాదాపు ఎలాంటి అవకాశాలు లేవని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
అధిక ఉష్ణోగ్రతలు:
సాయంత్రం వేళల్లో హ్యుమిడిటీ (తేమ) 70 నుంచి 80 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మొదటి ఇన్నింగ్స్ సమయంలో 'ఫీల్స్ లైక్' (ఉష్ణోగ్రత తీవ్రత) ఏకంగా 42°C (109°F) గా నమోదయ్యే ప్రమాదం ఉంది. ఇది ఆటగాళ్లకు తీవ్రమైన చెమట, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
పిచ్ రిపోర్టు:
ఐపీఎల్ 2026లో ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణం కంటే కాస్త స్లోగా కనిపిస్తోంది. ఇది అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లు ఇద్దరికీ సమానంగా సహకరిస్తోంది. కొత్త బంతితో పేసర్లకు ల్యాటరల్ మూవ్‌మెంట్, బౌన్స్ లభిస్తుండగా.. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు పిచ్ నుంచి మంచి గ్రిప్, టర్న్ దక్కుతోంది. బంతి ఒక్కసారి ఇన్‌ఫీల్డ్ దాటిందంటే మెరుపు వేగంతో బౌండరీకి దూసుకెళ్తుంది.
వర్షం పడే ఛాన్స్ తక్కువ:
గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో పెద్దగా వర్షాలు పడలేదు. ఈ రోజు (మే 16) వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు ఉదయం సూచించినప్పటికీ, మ్యాచ్ జరిగే సమయానికి ఎలాంటి అంతరాయం ఉండకపోవచ్చని తాజా వెదర్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్‌కు పూర్తి 40 ఓవర్ల హైవోల్టేజ్ మ్యాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ లభించడం పక్కా!.
