తెలంగాణలో మూడు రోజులు పొడి వాతావరణం

తెలంగాణలో మూడు రోజులు పొడి వాతావరణం

తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హెచ్చరికలు ఏమీ లేవని..పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రోజు 23వ తేదీన నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మిగిలిన భాగాల నుంచి, భారతదేశం నుంచి పూర్తిగా తిరోగమించాయని తెలిపారు. వాయుగుండం నిన్న రాత్రి తీవ్ర వాయుగుండంగా బలపడిందని, ఇది వాయవ్య దిశగా ప్రయాణించి.. ఆదివారం ఉదయం 8:30 కి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో  కొనసాగిందన్నారు.

సాగర్ ద్వీపానికి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని, ఈ తీవ్ర వాయుగుండం వాయవ్య దిశగా కదలి రాగల 12 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందన్నారు. అనంతరం తన దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలోని తింకొన ద్వీపం, శాండ్విప్ మధ్యలో బరిసల్ కి దగ్గరలో ఈనెల 25 ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందన్నారు.