రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ జారీ

రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ రెండ్రోజులు ఆరెంజ్ అలర్ట్‌‌ ఉంటుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పింది. ఆ తర్వాతి రెండు రోజులు కూడా పలు చోట్ల వర్షాలు పడతాయని వెల్లడించింది.

సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్‌‌‌‌కర్నూల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట్, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు వడగండ్లు పడతాయని పేర్కొంది. శుక్రవారం సంగారెడ్డి, మెదక్ జిల్లాలో పలుచోట్ల వడగండ్ల వాన పడింది. సూర్యాపేట జిల్లా దిర్సెంచర్లలో అత్యధికంగా 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. కామారెడ్డి జిల్లా పెద్దకొదపగల్‌‌లో అత్యధికంగా 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.