చండీగఢ్ను వణికిస్తున్న వానలు

చండీగఢ్ను  వణికిస్తున్న వానలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాన్ స్టాప్గా పడుతున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు చండీగఢ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. భారీ వానలతో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది.  దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 


 ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  ఎడతెరిపి లేని వానలతో ఢిల్లీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వానలతో వాహనాల దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఢిల్లీలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. ఈ మేరకు  ఎల్లో అలర్ట్‌  కూడా జారీ చేసింది.