తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు

తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు

హైదరాబాద్ సహా జిల్లాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వెదర్ డిపార్ట్ మెంట్. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయన్నారు. సిటీతో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. 

అలాగే రేపు పలు ప్రాంతాలకు మాత్రం హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.  ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.