తెలంగాణలో 3 రోజులు తేలికపాటి వానలు

 తెలంగాణలో 3 రోజులు తేలికపాటి వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. దక్షిణ తెలంగాణ, పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురిసే చాన్స్ ఉందని తెలిపింది. ఆదివారం ఉత్తర తెలంగాణ సహా 14 జిల్లాల్లో.. సోమవారం దక్షిణ తెలంగాణలోని 8 జిల్లాల్లో వర్షం కురవొచ్చని వెల్లడించింది. 

కాగా, వర్ష ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో టెంపరేచర్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్​మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్​డీపీఎస్) వెల్లడించింది. అదే సమయంలో రాత్రి టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.