మూడ్రోజులు రాష్ట్రమంతా మోస్తరు వర్షాలు

మూడ్రోజులు రాష్ట్రమంతా మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఆదిలాబాద్‌‌, ఆసిఫాబాద్‌‌, మంచిర్యాల, నిర్మల్‌‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో 5.5 సెం.మీ., సంగారెడ్డిలోని పుల్కల్‌‌లో 5.4, మహబూబాబాద్‌‌లోని నెల్లికుదురులో 5.3, కామారెడ్డిలోని పాత రాజంపేటలో 4.8 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయింది. 

6 జిల్లాల్లో భారీ వానలు

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. బేగంబజార్‌, ఎంజే మార్కెట్‌, సుల్తాన్‌ బజార్‌, బషీర్ బాగ్‌, నాంపల్లి, హిమాయత్‌ నగర్‌, నారాయణగూడ, లిబర్టీ, సికింద్రాబాద్‌, హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.