పలు జిల్లాల్లో తేలికపాటి వానలు

పలు జిల్లాల్లో తేలికపాటి వానలు

రాగల మూడు గంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ అర్బన్ రూరల్, కరీంనగర్, సిద్దిపేట్, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, మెదక్ జిల్లాలోని ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయిని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

కాగా, ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకు విస్తరించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీ తీరంలో బంగాళాఖాతంలో 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే.. దక్షిణ తెలంగాణలో వర్షాల తీవ్రత తగ్గింది. పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది.