
భారీ వర్షా లే కాదు... చిన్నచిన్న తుంపర్లు పడుతున్నా... ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాగే నీటి దగ్గరి నుంచి... అన్నింట్లోనూ ఆచితూచి వ్యవహరించాలి. మరి ఎలాంటి జా గ్రత్తలు తీసుకుంటే... ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం.
సమస్యలు...
- వర్షాలు పడినప్పుడు ఇంటి పరిసర ప్రాంతాల్లో... అంటే గుంతల్లో, రోడ్ల మీద, బయట పాత సామాన్లలో నీళ్లు నిలుస్తాయి. అలాంటి చోట దోమలు ఎక్కువగా చేరి... వాటి ద్వారా మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉంది.
- అలాగే ఈ కాలంలో ఎగ్జిమా, యాక్నె, సోరియాసిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తీవ్రంగా మారే అవకాశాలు ఉంటాయి.
ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు
- వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ... నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి.
- స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తినేవాళ్లు.... ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు బయట తినడంమానేయాలి. అంతేకాదు... బయట కొన్న పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగాకే తినాలి.
- దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నుంచి రక్షించుకోవాలంటే రోజూ చేతులు, కాళ్లకు ఇన్ సెక్ట్ రెపెల్లెంట్ రాసుకోవాలి. అలాగే యాంటీ మలేరియా మందులను కూడా తీసుకోవడం మంచిది. వీలైనంత వరకు మురికి నీళ్లు ప్రవహించే చోటికి వెళ్లకపోవడం మేలు.
- వానలో తడిస్తే ఇంటికి రాగానే... తడిగా ఉన్న బట్టలు, సాక్సిని విడవాలి. కాళ్లను నీళ్లతో కడిగి తుడుచుకోవాలి. వర్షంలో తడిచాక స్నానం చేయడం తప్పనిసరి.
- మార్కెట్ లో దొరికే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుని వాడాలి. అలా చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.
- శరీరాన్ని వెచ్చగా, పొడిగా ఉంచుకుంటే.... జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.
- ఏసీ ఉన్న రూముల్లోకి తడి జుట్టు, దుస్తులతో ఈ కాలంలో ఎప్పుడూ కాస్తంత వదులుగా ఉన్న కాటన్ దుస్తులే వేసుకోవాలి. వీలైనంత వరకు సింథటిక్ ఫైబర్ కు దూరంగా ఉండాలి.
- చర్మంపై చెమట, తేమ పేరుకుపోకుండా యాంటీ ఫంగల్ పౌడర్ను వాడాలి. ఏదైనా ఇన్ ఫెక్షన్తో బాధపడుతున్నట్లైతే... డాక్టర్ల సలహా మేరకు మెడికల్ పౌడర్లను ఉపయోగించాలి.
- ఆస్తమా, డయాబెటిస్ బాధితులు.... చినుకులు పడుతున్న కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
- క్రమం తప్పకుండా రెగ్యులర్ గా వాడే మందులతో పాటు వ్యాక్సినేషన్ తీసుకోవాలి.
- మామూలు టీ కంటే హెర్బల్ టీ తాగడం మంచిది. అలాగే వేడి చేసి, చల్లార్చిన నీళ్లను తాగాలి.
- విటమిన్-సి ఉన్న కూరగాయలు, పండ్లను తరచూ తీసుకోవాలి. అవి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
- పిల్లల చర్మం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మృదువుగా, సున్నితంగా ఉండే పిల్లల చర్మానికి డాక్టర్ల పర్యవేక్షణలో మాయిశ్చరైజర్ వాడాలి.