రైతుబంధు డబ్బులు రుణమాఫీ కింద కట్

రైతుబంధు డబ్బులు రుణమాఫీ కింద కట్

వెల్గటూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి కొన్ని బ్యాంకులు అడ్డుతగులుతున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో బ్యాంక్ ఆఫీసర్ల తీరుపై రైతులు మండిపడుతున్నారు. అంబారిపేట్ గ్రామానికి చెందిన దూట మల్లేశ్ అనే రైతుకు రైతు బంధు కింద రూ.14 వేలు అకౌంట్ లో జమకాగా.. సోమవారం విత్ డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంక్ ఆఫీసర్లు క్రాఫ్ లోన్ చెల్లించాల్సి ఉందని కట్ చేసుకుని లోన్ డాక్యుమెంట్ ను రెన్యువల్ చేసుకున్నారు. డబ్బులు ఇచ్చేదేమీ లేదని బ్యాంకు వాళ్లు చెప్ప్డంతో చేసేదేమీ లేక రైతు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. వెల్గటూరు లొనే కాదు జగిత్యాల జిల్లా అంతటా రైతులకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతుండటంతో ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందిస్తున్న డబ్బులు చేతికందకుండా పోతున్నాయి. పెట్టుబడి సాయాన్ని తమకు అందేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. బ్యాంకు ఆఫీసర్లు మాత్రం  సదరు రైతుకు ఎలాంటి లోన్లు లేకపోతేనే  చెల్లిస్తామని చెప్తున్నారు.