ఈ బ్యాంకులలో అకౌంట్ ఉంటే డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే

ఈ బ్యాంకులలో అకౌంట్ ఉంటే డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే

ఈ వానాకాలానికి సంబంధించిన రైతుబంధు డబ్బులను జూన్ 15, 2021 నుంచి మొదలు పెట్టి జూన్ 25, 2021లోపు అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే దీనికి సంబంధించి రైతులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. గతంలో కొన్ని బ్యాంకులను వేరే బ్యాంకుల్లో విలీనం చేయడం వల్ల రైతులు మళ్లీ వారి బ్యాంకు పాస్ బుక్‌, పట్టాదారు పాస్ బుక్‌, మరియు ఆధార్ కార్డులను మండల వ్యవసాయ అధికారికి జూన్ 10లోపు ఇవ్వాల్సి ఉంటుంది.  అలా చేయకపోతే వారి ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉండకపోవచ్చు.

ఈ బ్యాంకులలో ఖాతా ఉంటే డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందే.. 
1) ఆంధ్రా బ్యాంకు

2) కార్పొరేషన్ బ్యాంకు

3) దేనా బ్యాంకు

4) విజయా బ్యాంకు

5)  సిండికేట్ బ్యాంకు

6) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్

పైన తెలిపిన బ్యాంకుల వారు కాకుండా మిగతా బ్యాంకులలో ఖాతాలు కలిగిన వారు ఎలాంటి పత్రాలు సమర్పించవలసిన అవసరం లేదని  వ్యవసాయ శాఖ తెలిపింది.