శిల్పాశెట్టికి తెలియకుండానే పోర్నోగ్రఫీ జరిగిందా?

V6 Velugu Posted on Jul 21, 2021

ముంబై: పోర్న్ వీడియోల కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అమాయక మహిళల్ని, మోడల్స్ ను పోర్న్ లోకి దింపుతున్నాడని కుంద్రాపై ఆరోపణలు వస్తున్నాయి. మూవీ ఛాన్స్ ఇప్పిస్తానని కుంద్రా మహిళల్ని నమ్మించి వారిని సెక్స్ వీడియోల్లో నటింపజేస్తున్నాడు. ఇలా తీసిన వీడియోలను యూకేలో హాట్ షాట్ అనే పెయిడ్ యాప్స్ లో పెడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. 

శిల్పా హస్తం ఉందా?
రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆయన భార్య, నటి శిల్పాశెట్టి ప్రమేయం ఎంతవరకు ఉందనేది ఇంకా తెలియరాలేదు. అయితే శిల్పాను ప్రశ్నించాలని మోడల్, నటి సాగరికా సోనా సుమన్ పేర్కొంది. రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు తీస్తున్న కెన్రిన్ కంపెనీకి శిల్పాశెట్టి డైరెక్టర్ అని సాగరిక తెలిపింది. కాబట్టి ఆమెను ప్రశ్నించాలని, ఈ కేసులో ఆమె ప్రమేయంపై విచారణ జరపాలని పేర్కొంది. అయినా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న శిల్పాకు తెలియకుండా కంపెనీ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నయని క్వశ్చన్ చేసింది. కెన్రిన్ ప్రొడక్షన్ కంపెనీకి భారత్ లో రిప్రజెంటేటివ్ గా ఉన్న ఉమేశ్ కామత్ తనను వీడియో కాల్ లో ఆడిషన్ చేశాడని చెప్పింది సాగరిక. ఆ సమయంలో నగ్నంగా ఆడిషన్ ఇవ్వాలని ఉమేశ్ కోరినట్లు తెలిపింది. ఆ కాల్ లో రాజ్ కుంద్రా కూడా ఉన్నారని.. వాళ్లు బూతులు మాట్లాడారని వాపోయింది. 

Tagged Mumbai Police, Raj Kundra, shilpa shetty, Shilpa Shetty Husband, Umesh Kamat, Porn Case, Sagarika Sona Suman

Latest Videos

Subscribe Now

More News