రాజ్ తరుణ్ మూవీ వాయిదా..థియేటర్స్‌లోకి ఎప్పుడు రానుందంటే?

రాజ్ తరుణ్ మూవీ వాయిదా..థియేటర్స్‌లోకి ఎప్పుడు రానుందంటే?

రాజ్‌‌ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా  జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘భలే ఉన్నాడే’.  డైరెక్టర్ మారుతి సమర్పణలో ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ కొత్త రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వలన సెప్టెంబర్ 7న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రాన్ని ఒక వారం వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు.సెప్టెంబర్ 13న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు.

‘ఈసారి ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ పక్కా గ్యారంటీ’ అని చెబుతోంది టీమ్.  ఇప్పటికే విడుదలైన  టీజర్, ట్రైలర్, సాంగ్స్‌‌కి మంచి  రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అమ్మాయిలంటే ఆమడ దూరంలో ఉండే హీరో పాత్రని  పరిచయం చేస్తూ సాగిన ట్రైలర్ హిలేరియస్‌‌‌‌‌‌‌‌గా ఉంది.

రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య వచ్చే సీన్స్, లవ్ స్టోరీ ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటూనే, గణేష్‌‌‌‌‌‌‌‌తో సాగే ఫన్నీ ట్రాక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంది.సింగీతం శ్రీనివాస్, అభిరామి, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.  శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.