పైరసీ ద్వారా సినిమా వాళ్లకంటే ప్రజలకే ఎక్కువ నష్టం ఉంటుందన్నారు డైరెక్టర్ రాజమౌళి. పైరసీ సినిమాలు చూసి కొన్ని సార్లు కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయని అన్నారు. 2025 నవంబర్ 17 న పోలీసులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. ప్రజలు సినిమా ఫ్రీగా చూస్తున్నామని అనుకుంటున్నారని.. కానీ దీని వెనుక ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేక పోతున్నారని అన్నారు.
జీవితంలో ఏ వస్తువైనా ఉచితంగా రాదు.. ప్రతీ దాని వెనుక చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. పైరసీ చేసే వాళ్లు సంఘసేవ చేయడం లేదు.. పైరసీ ద్వారా సినిమా వాళ్లుగా మేం నష్ట పోతున్నం.. కానీ మా కంటే ప్రజలకే ఎక్కువ నష్టం.. అని అన్నారు. పైరసీ ఆ సర్వర్ లు మెయింటైన్ చేయడం ద్వారా చాలా డబ్బుతో కూడుకున్న పని.. దీనికి డబ్బు ఇస్తున్నది మీరే.. మీ పర్సనల్ డేటా ఇవ్వడం ద్వారా డబ్బులు ఇస్తున్నారు.. మీ పేరు, మీ నెంబర్, ఆధార్ నెంబర్, మెయిల్ ద్వారా.. మీ డేటా అమ్ముతున్నారు.. ఆ ఇన్ఫర్మేషన్ ను క్రిమినల్స్ కు అమ్ముతున్నారు.. దీంతో సైబర్ క్రిమినల్స్ చేసే నేరాలతో డబ్బుతో పాటు కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్నారు.. మా కంటే మీరే ఎక్కువ నష్టపోతున్నారు.. అని హెచ్చరించారు రాజమౌళి.
సినిమా ఫ్రీగా చూస్తున్నాం అనుకుంటున్నారు సినిమా చూడటానికి రెండు మార్గాలు. ఒకటి సబ్ స్క్రిప్షన్ ద్వారా చూడటం. ఆథరైజ్డ్ నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థల ద్వారా సబ్ స్క్రిప్షన్ చేసుకుని చూడటం.. రెండోది పైరసీ ద్వారా చూడటం. పైరసీ చూసీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టం అని సూచించారు.
ఐబొమ్మ నడిపిన ఇమ్మడి రవి.. బస్మాసుర హస్తం లాగ తన నెత్తిన తనే చెయ్యి పెట్టుకున్నాడని అన్నారు రాజమౌళి. పోలీసులకు సవాల్ విసిరి చివరికి దొరికిపోయాడని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ పోలీసుల తెగువను కొనియాడారు.
