
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జన పల్లిలో పోడు భూముల పోరు తారాస్థాయికి చేరుతోంది. ఒకవైపు ఫారెస్ట్ అధికారుల పంతం, మరోవైపు సాగు దారుల తెగింపుతో పోడు భూములు... పోరు భూములుగా మారుతున్నాయి. ఫారెస్ట్ అధికారులకు రైతుల నుంచి....ప్రతిఘటన ఎదురవుతుంది. నిన్న ఫారెస్ట్ అధికారులు ఇతర గ్రామ కూలీలతో హరితహారం పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటే, గర్జనపల్లి గ్రామ రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇవాళ మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోడు భూములు సాగుచేస్తున్న దళితులు... మూకుమ్మడిగా విత్తనాలు నాటడానికి సిద్దమయ్యారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.. మరోవైపు రైతులకు మద్దతుగా పోడు భూముల దగ్గరకు చేరుకున్నారు బీజేపీ నేతలు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను గుంజుకోవటం సరికాదంటున్నారు. అయితే తాము ఫారెస్ట్ అధికారులతో మాట్లాడుతామని పోలీసులు చెప్పటంతో వెనక్కి తగ్గారు గ్రామస్తులు. పోలీసుల హామీతో తిరిగి గ్రామానికి వెళ్లారు.