
- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: గోవుల అక్రమ రవాణాకు రాష్ట్రంలో పోలీసులే సహకరిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో అమలుకావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆవుల రక్తంతో తడిసిన రాష్ట్రానికి మంచి జరగదన్నారు. పోలీస్ప్రొటెక్షన్ తో రాష్ట్రంలో వేల ఆవులు కోతకు గురవుతున్నాయని, ఛత్రపతి శివాజీ స్పూర్తితో గోరక్షకులు నడుం బిగించాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.