రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు మొదలైన పోలింగ్

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు  మొదలైన పోలింగ్

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు 2023 నవంబర్ 25వ తేదీన  పోలింగ్ మొదలైంది.  ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ల ముందు ఓటర్లు  బారులు తీరారు.  రాష్ట్రంలోని 200 అసెంబ్లీ సీట్లకు గాను 199 చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.  ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.  పోలింగ్ ప్రశాంతంగా వందశాతం జరిగేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.  

కరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ చనిపోవడంతో అక్కడ ఎన్నికను వాయిదా వేశారు.  ఇక ఐదేండ్లకోసారి ప్రభుత్వాన్ని మారుస్తూ వస్తున్న ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.  రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం ఓటర్లు 5.25 కోట్ల మంది. వీరిలో 18–30 ఏండ్ల వయసున్న వారు 1.71 కోట్ల మంది ఉన్నారు. కేవలం 18–19 ఏండ్ల మధ్య ఉన్న వాళ్లే 22.6 లక్షల మంది ఉన్నారు. దీంతో యువత ఓటు కీలకంగా మారనుంది.