ఒకే ట్వీట్.. రాజస్థాన్ సీఎం ఓఎస్‌డి రాజీనామా

ఒకే ట్వీట్.. రాజస్థాన్ సీఎం ఓఎస్‌డి రాజీనామా
  • పంజాబ్ లో నాయకత్వ మార్పు అంశంలో కాంగ్రెస్ పార్టీపై పరోక్ష విమర్శలతో ట్వీట్
  • కాంగ్రెస్ పార్టీలో దుమారంతో.. ట్వీట్ కు క్షమాపణ కోరుతూ.. రాజీనామా

 జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి) లోకేష్ శర్మ శనివారం రాత్రి తన రాజీనామాను సమర్పించారు, పంజాబ్‌లో నాయకత్వం మార్పుపై కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శగా చేసిన ట్వీట్ కు ఆయన తన రాజీనామా మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ చేసిన ఒకే ఒక్క ట్వీట్‌ కలకలం రేపి ఆయన రాజీనామాకు దారితీసింది. తన ట్వీట్ పై దుమారం చెలరేగడంతో ఆయన స్పందించి తన ట్వీట్‌కు క్షమాపణ కోరుతూ రాజీనామా చేశారు. పంజాబ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమరీంద్‌ సింగ్‌ రాజీనామా తర్వాత... ఆ ట్వీట్‌లో బలమైన వ్యక్తి నిస్సహాయుడిగా మారడం, ఒక సామాన్య వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకున్నారనేలా ట్వీట్‌ కనిపించింది. 
లోకేష్ శర్మ తన రాజీనామా లేఖలో ట్విట్టర్‌లో 2010 నుండి యాక్టివ్‌గా ఉన్నానని, పార్టీ శ్రేణులను దాటి తానెప్పుడూ ట్వీట్‌ చేయలేదని వివరణ ఇచ్చారు. తనకు ఒఎస్‌డి పదవినిచ్చినప్పటి నుండి ఎటువంటి రాజకీయ ట్వీట్‌ చేయలేదని, అయినప్పటికీ క్షమాపణ చెబుతూ రాజీనామా చేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో లోకేష్‌ పది సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలు కల్గి ఉన్న లోకేశ్ శర్మ గెహ్లాట్‌ సోషల్‌ మీడియా ఖాతాను కూడా ఆయనే చూస్తున్నారు. 2018లో గెహ్లాట్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన ఒఎస్‌డి

గా నియమితులయ్యారు.గత మార్చి నెలలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు శర్మపై కేసు నమోదు చేశారు.