ఆర్మీపై గూఢచర్యం.. సిమ్‌ కార్డులు అమ్మే వ్యక్తి అరెస్ట్

ఆర్మీపై గూఢచర్యం.. సిమ్‌ కార్డులు అమ్మే వ్యక్తి అరెస్ట్

ఆర్మీ యాక్టివిటీస్‌పై రహస్యంగా సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకు పంపుతున్న ఓ వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైసల్మేర్‌‌లో సిమ్‌ కార్డులు అమ్మే షాప్‌ నడుపుతున్న నిబాబ్ ఖాన్‌ అనే వ్యక్తి గూఢచర్యం చేస్తున్నాడని సమాచారం రావడంతో అరెస్ట్ చేశామని ఇవాళ (శనివారం) పోలీసులు తెలిపారు. అతడి గురించి సమాచారం రావడంతో తమ ఇంటెలిజెన్స్ ద్వారా రహస్యంగా ఎంక్వైరీ చేయగా.. ఈ విషయం నిజమని తేలిందని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఉమేశ్ మిశ్రా చెప్పారు.

2015లో నిబాబ్ ఖాన్ పాకిస్థాన్ వెళ్లాడని, అక్కడ ఐఎస్ఐ హ్యాండ్లర్ ఒకడితో కాంటాక్ట్ అయ్యాడని పోలీసులు తెలిపారు. అతడు ఆ సమయంలో 15 రోజులు అక్కడే ఉండి ట్రైనింగ్ తీసుకున్నాడని, రిటర్న్‌లో పది వేల రూపాయల డబ్బు ఇచ్చి పంపారని తమ ఎంక్వైరీలో తేలిందన్నారు. జైసల్మేర్ ప్రాంతంలో ఆర్మీ చేసే లోకల్ యాక్టివిటీస్‌పై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా ఐఎస్‌ఐకి చేరవేసేవాడని చెప్పారు.