రాజస్థాన్ మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం వద్దే 8 కీలక శాఖలు

రాజస్థాన్ మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం వద్దే 8 కీలక శాఖలు

ఇటీవల రాజస్థాన్ లో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం తన కేబినేట్ లోని మంత్రులకు శాఖలు కేటాయించింది. ఇందులో కీలకమైన 8 శాఖలను  సీఎం భజన్‌లాల్‌ శర్మ తన వద్దే ఉంచుకున్నారు. ఇందులో హోం శాఖ, ఎక్సైజ్‌ శాఖ, అవినీతి నిరోధక శాఖ, కార్మిక శాఖ, గృహశాఖలు ఉన్నాయి. ఇక డిప్యూటీ సీఎం కుమారికి కీలకమైన ఆర్థికశాఖతో పాటుగా  పర్యాటకం, కళలు సాహిత్యం సాంస్కృతిక, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, మహిళా శిశు సంక్షేమశాఖలను అప్పగించారు. మరో డిప్యూటీ సీఎం ప్రేమ్‌ చంద్‌ బైరవాకు టెక్నికల్‌- ఉన్నత విద్య, రవాణా శాఖను కేటాయించారు. 

మిగితా శాఖల విషయానికి వచ్చేసనరికి కిరోడి లాల్ మీనాకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కు పరిశ్రమలు, వాణిజ్యం, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ, గజేంద్ర సింగ్ ఖిమ్‌సర్‌కి వైద్య ఆరోగ్యం, మదన్ దిలావర్ కు పంచాయితీ రాజ్ శాఖ  కేటాయించారు.  మంత్రులకు శాఖలను కేటాయించడంలో బీజేపీ ‍ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది.

2023 డిసెంబర్ 03న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. డిసెంబర్‌ 15న రాజస్థాన్‌ సీఎంగా భజన్‌ లాల్‌ శర్మ, డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్‌చంద్‌ బైర్వా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 30న 22 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 17 మంది తొలిసారిగా మంత్రులుగా ఎన్నికైయ్యారు.  ఇవాళ వీరికి శాఖలు కేటాయించారు.