భారత ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్

భారత ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్

భారత కొత్త ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన పలు కేంద్ర మంత్రిత్వ శాఖలతోపాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. రిటైర్‌మెంట్ తర్వాత పబ్లిక్ ఎంటర్‌ప్రై‌జెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఆ పదవిలో ఆగస్టు 31 వరకు కొనసాగారు. ఆ పదవీకాలం నిన్నటి ముగియటంతో.. తాజాగా ఆయనను ఎన్నికల కమిషనర్‌గా కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది.

For More News..

ఒకే ఫ్యామిలీకి చెందిన 32 మందికి కరోనా పాజిటివ్

మొరటోరియం మరో రెండేళ్లు పెంచే యోచనలో కేంద్రం!

దాదాకు నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతి