
హైదరాబాద్: రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఏసీబీ వలకు చిక్కాడు. శుక్రవారం (జూలై 25) రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో రైడ్ చేసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ హోటల్ యజమాని నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు రవికుమార్.
అనంతరం ఆయన కార్యాలయంలో సోదాలు చేశారు. అక్రమ లావాదేవీలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆయన్ను విచారించారు. కార్యాలయంలోని పలు దస్త్రాలు, డిజిటల్ డేటా, నగదు వివరాలను పరిశీలించారు. అనంతరం రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలతో జీహెచ్ఎంసీలో కలకలం రేగింది.