హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ మండలం లక్ష్మిగూడలో ఉన్న హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్ల విక్రయానికి కొనుగోలుదారుల నుంచి భారీ స్పందన లభించింది. బుధవారం నిర్వహించిన వేలంలో మొత్తం 14 ప్లాట్లు అమ్ముడయ్యాయని, వీటి ద్వారా రూ.14.75 కోట్ల ఆదాయం వచ్చిందని హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భూములకు చదరపు గజానికి రూ.32 వేలను కనీస ధరగా నిర్ణయించగా, వేలం పాటలో గరిష్టంగా చదరపు గజం రూ.51 వేలు పలికిందని చెప్పారు.
