న్యూఢిల్లీ: బంగారం ఎగుమతుల సంస్థ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహించగా, ఆసక్తికర విషయాలు తెలిశాయి. రూ. 7.7 లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీ సీఎఫ్‌ఓ 2020 నుంచి జీతం తీసుకోలేదు. ఎండీకి నెలకు కేవలం రూ. 17 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.
సంస్థ అక్రమంగా రూ. 600 కోట్లకు పైగా నిధులను విదేశాలకు మళ్లించినట్టు గుర్తించారు. ఆఫ్రికన్ గనుల్లో పెట్టిన రూ. 1,035 కోట్ల పెట్టుబడి రికార్డులు లేవని ఈడీ వర్గాలు తెలిపాయి.
