47 ఏళ్ల గ్యాప్ త‌‌‌‌ర్వాత రజినీ, కమల్ కాంబో మూవీ.. ఇద్దరిలో హీరో ఎవరు..?

47 ఏళ్ల  గ్యాప్ త‌‌‌‌ర్వాత రజినీ, కమల్ కాంబో మూవీ.. ఇద్దరిలో హీరో ఎవరు..?

న‌‌‌‌ల‌‌‌‌భై ఏడేళ్ల లాంగ్ గ్యాప్ త‌‌‌‌ర్వాత రజినీకాంత్, కమల్ హాసన్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌లో ఓ సినిమా రాబోతోంది. ‘జైలర్‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ నెల్సన్ దిలీప్‌‌‌‌ కుమార్ దీనికి దర్శకుడు. ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నాడు. శనివారం ఈ మూవీ గ్లింప్స్‌‌‌‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేశారు.  ఇందులో రజినీకాంత్, కమల్ హాసన్‌‌‌‌ సూపర్ స్టైలిష్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపించారు. 

ఈ ఇద్దరు కోలీవుడ్ స్టార్స్ ఇమేజ్‌‌‌‌కు తగ్గ స్థాయిలో వాళ్ల స్వాగ్‌‌‌‌,  మ్యానరిజమ్స్‌‌‌‌ను హైలైట్‌‌‌‌ చేస్తూ నెల్సన్‌‌‌‌ ఈ గ్లింప్స్‌‌‌‌ను ప్రజెంట్ చేశాడు. గ్లింప్స్‌‌‌‌లో ఇద్దరు హీరోల రూమ్స్‌‌‌‌ దగ్గర నిలబడ్డ నెల్సన్‌‌‌‌.. ఎవరి రూమ్‌‌‌‌లోకి ముందు వెళ్లాలా అని ఆలోచిస్తూ కనిపించాడు. ఆ తర్వాత కాస్ట్యూమ్స్‌‌‌‌ మొదలు చేతి వాచ్‌‌‌‌ వరకు ఒకరు ఎంచుకున్న వాటిని మరొకరు వద్దని వేర్వేరు డ్రెస్సుల్లో ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. కార్‌‌‌‌‌‌‌‌ షెడ్‌‌‌‌లో అల్ట్రా మోడ్రన్‌‌‌‌ మోడల్స్‌‌‌‌ మధ్య అనిరుధ్‌‌‌‌ మార్క్‌‌‌‌ రెట్రో స్టైల్‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌తో ఇద్దరు సూపర్ స్టార్స్‌‌‌‌ నడిచొస్తున్న విజువల్స్‌‌‌‌ అభిమానుల్లో జోష్‌‌‌‌ నింపాయి.  

తెలుగు, హిందీ వెర్షన్స్‌‌‌‌కు కమల్, రజినీ స్వయంగా డబ్బింగ్ చెప్పారు. కారు ముందు సీట్లలో ఇద్దరు స్టార్స్‌‌‌‌ కూర్చొగా, నెల్సన్‌‌‌‌తో కలిసి వెనుక కూర్చోన్న అనిరుధ్ ఈ మూవీ థీమ్ మ్యూజిక్ వినిపించమంటారా అని అడగ్గా.. అదంతా తర్వాత ముందు సినిమాలో హీరో ఎవరో చెప్పమనడం, అందుకు రజినీకాంత్ కూడా ‘అడుగుతున్నారుగా చెప్పండి’ అని అడగడం గ్లింప్స్‌‌‌‌కు హైలైట్‌‌‌‌గా నిలిచింది.  ఒకప్పుడు కమల్ హాసన్ హీరోగా నటించిన పలు చిత్రాల్లో రజినీకాంత్ విలన్‌‌‌‌గా నటించిన విషయం తెలిసిందే.  మరి ఈసారి హీరో ఎవరు, విలన్‌‌‌‌ ఎవరు అనేది తెలియాల్సి ఉంది!