Rajinikanth: నెల్సన్, అనిరుధ్‍తో రజినీకాంత్‌‌‌‌.. తలైవా మాస్ సంభవం క్రేజీ అప్డేట్

Rajinikanth: నెల్సన్, అనిరుధ్‍తో రజినీకాంత్‌‌‌‌.. తలైవా మాస్ సంభవం క్రేజీ అప్డేట్

రజినీకాంత్‌‌‌‌ నుంచి రాబోతున్న మోస్ట్‌‌‌‌ అవైటెడ్‌‌‌‌ మూవీ ‘జైలర్‌‌‌‌‌‌‌‌ 2’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. గత కొన్నిరోజులుగా కేరళలోని  పాలక్కాడ్‌‌‌‌లో షూటింగ్‌‌ చేస్తున్నారు.

ఇటీవల ఈ షెడ్యూల్‌‌‌‌లో పాల్గొని చెన్నై తిరిగొస్తున్న రజినీకాంత్.. ఎయిర్‌‌‌‌పోర్ట్​లో మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘జైలర్‌‌‌‌‌‌‌‌ 2’ రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌పై క్లారిటీ ఇచ్చారు. జూన్‌‌‌‌ 12న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తర్వాతి షెడ్యూల్‌‌ను గోవాలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో లేదా జనవరిలో షూటింగ్‌‌‌‌ను కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

‘జైలర్‌‌‌‌‌‌‌‌’లో నటించిన రమ్యకృష్ణ, మిర్నా మీనన్, శివరాజ్ కుమార్‌‌‌‌‌‌‌‌ సీక్వెల్‌‌‌‌లోనూ కనిపించబోతున్నారు. బాలకృష్ణ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు ప్రచారంలో ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత కమల్ హాసన్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో తన తదుపరి చిత్రం  చేయబోతున్నట్టు ఇటీవల రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. 

జైలర్‌‌‌‌‌‌‌‌ విషయానికి వస్తే.. 2023 ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. సుమారు రూ.650 కోట్ల కలెక్షన్లను దక్కించుకుని రజనీకాంత్ కెరీర్ లోనే  బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో స్వాగ్, స్టైల్, యాక్షన్‍తో రజినీ దుమ్మురేపారు. ఇక ఇప్పుడు జైలర్ 2తో తలైవా ఎలాంటి మాస్ సంభవం క్రియేట్ చేయనున్నాడో చూడాలి!