సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కి ఫైన్ వేసిన చెన్నై ట్రాఫిక్ పోలీసులు

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కి ఫైన్ వేసిన చెన్నై ట్రాఫిక్ పోలీసులు

చెన్నై: కార్ డ్రైవింగ్ చేస్తున్న స‌మ‌యంలో సీట్ బెల్ట్ పెట్డుకోలేదన్న కార‌ణంతో సినీ నటుడు రజనీకాంత్ కు ఫైన్ వేశారు చెన్నై ట్రాఫిక్ పోలీసులు. గత నెల 26 న రజనీకాంత్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని,   అందుకు 100 రూపాయలు జ‌రిమానా విధించినట్టు పోలీసులు తెలిపారు.
ఈ నెల 20 న రజనీకాంత్ స‌రికొత్త లంబోర్ఘిని కారు నడుపుతున్న చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ త‌ర్వాత‌ తన కుమార్తె సౌందర్య మరియు ఆమె కుటుంబంతో కలిసి, కొత్త కారు నేపథ్యంలో ఉన్న చిత్రాలను కూడా సూపర్ స్టార్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

Rajinikanth fined by Chennai Traffic Police for not wearing seat-belt