ఈ రూట్లో వెళ్తున్నారా.. ఈవిషయం తెలుసా.. 9నెలలపాటు.. ప్యారడైస్ టు డెయిరీ ఫామ్ రోడ్డు బంద్

ఈ రూట్లో వెళ్తున్నారా.. ఈవిషయం తెలుసా.. 9నెలలపాటు.. ప్యారడైస్ టు డెయిరీ ఫామ్ రోడ్డు బంద్
  • ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మాణం నేపథ్యంలో ఆంక్షలు
  • 9 నెలల పాటు అమలు  

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్​రోడ్​ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి 9 నెలల పాటు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుంచి బాలంరాయ్ మధ్య రోడ్డును రెండు వైపులా బంద్​ చేయనున్నారు. ఈ క్రమంలో చుట్టుపక్కల రోడ్లు , జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, దీన్ని గమనించాలని సిటీ ట్రాఫిక్​జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ తెలిపారు. 

బాలానగర్ నుంచి పంజాగుట్ట వైపు, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు.. తాడ్‌బండ్ – మస్తాన్ కేఫ్ – డైమండ్ పాయింట్ – మడ్‌ ఫోర్ట్ – ఎన్​సీసీ – జేబీఎస్​– ఎస్​బీఐ రోడ్డులో వెళ్లొచ్చు. సుచిత్ర నుంచి పంజాగుట్ట వైపు అలాగే, ట్యాంక్ బండ్ వెళ్లే వాహనాలు..సేఫ్ ఎక్స్​ప్రెస్– బాపూజీ నగర్ – సెంటర్ పాయింట్ – డైమండ్ పాయింట్–మడ్‌ఫోర్ట్–ఎన్​సీసీ–జేబీఎస్– ఎస్​బీఐ రోడ్లను ఎంచుకోవాలి. 

ట్యాంక్ బండ్– రాణీగంజ్, పంజాగుట్ట– రసూల్‌పురా – ప్లాజా నుంచి  తాడ్‌బండ్ వెళ్లే వాహనాలు సిటీఓ  జంక్షన్ దగ్గర రాజీవ్ గాంధీ స్టాచ్యూ జంక్షన్‌లో మలుపుకుని అన్నా నగర్ – బాలంరాయి– తాడ్‌బండ్  రోడ్డులో వెళ్లాలి. అన్నా నగర్  లో ఉండే వారు పంజాగుట్ట,  ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలంటే..  మీటింగ్ పాయింట్ బైలేన్, హాకీ గ్రౌండ్ బైలేన్, పోలీస్ స్టేషన్ బైలేన్‌ల ద్వారా వెళ్లాలి. 

రాజీవ్ గాంధీ స్టాచ్యూ జంక్షన్ వైపు రాంగ్​రూట్​లో వెళ్లవద్దని , ప్రజలు ఈ డైవర్షన్లను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని జాయింట్​ సీపీ కోరారు.